Vuriike Chilakaa Lyrics & Tabs by Hariharan & Chitra
Vuriike Chilakaa
guitar chords lyrics
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇప్పుడు
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
నీ రాకకోసం తొలిప్రాణమైనా దాచింది నా వలపే
మనసంటి మగువా ఏ జాము రాక చితిమంటలే రేపె
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనులె
మోదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా
ఉరికే చిలకే వచ్చి వాలింది కలతవిడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఓడి
మోదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా
ఉరికే చిలకే వచ్చి వాలింది కలతవిడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఓడి
నెలవే తేలిపె నిన్ను చేరింది గతము వీడి
కలకీ ఇలకి ఉయలూగింది కంటపడి
కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇప్పుడు
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయనె
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికే
అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసె
ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చేలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
మోహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది
ఉరికే చిలకే వచ్చి వాలింది కలతవిడి
నెలవే తెలిపె నిన్ను చేరింది గతము వీడి
By [email protected]