Naari Naari Lyrics & Tabs by S.P. Balasubrahmanyam

Naari Naari

guitar chords lyrics

S.P. Balasubrahmanyam

Album : S.P. Balasubrahmanyam Telugu Film Hits spb PlayStop

ద్వాపరమంతా సవతుల సంత
జ్ఞాపకముందా గోపాలా
కలియుగమందు ఇద్దరి ముందు

సిలవయ్యావే శ్రీలోల
కాపురాన ఆపదలను ఈదిన శౌరి
ఏది నాకు చూపవా ఒక దారి
నారి నారి నడుమ మురారి
నారి నారి నడుమ మురారి
ఇరువురు భామల కౌగిలిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామి
తలమునకలుగా తడిసితివా
చిరుబురులాడేటి శ్రీదేవి
నీ శిరస్సును వంచిన కథ కన్నా
రుసరుసలాడేటి భూదేవి

చిరుబురులాడేటి శ్రీదేవి
నీ శిరస్సును వంచిన కథ కన్నా
రుసరుసలాడేటి భూదేవి
నీ పరువును తీసిన కథ విన్నా
గోవిందా.గోవిందా.గోవిందా.
సాగిందా జోడు మద్దెల సంగీతం
బాగుందా భామలిద్దరి భాగోతం
ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా
అన్నాడు ఆ యోగి వేమన
నా తరమా భవసాగారమీదను
అన్నాడు కంచర్ల గోపన్న
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
ఆ మాటలు విని ముంచకు స్వామి గంగన్
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇరువురు భామల కౌగిలిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
భామ కాలు తాకిందా కృష్ణుడే గోవింద
అన్నాడు ఆ నంది తిమ్మన
ఒక మాట ఒక బాణం ఒక సీత నాదని
అన్నాడు సాకేత రామన్న
ఎదునాదా భామ విడుము రుక్మిణి చాలున్
రఘునాదా సీతను గొని విడు సూర్పనఖన్
రాసలీలలాడాలని నాకు లేదులే
భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే
ఇరువురు భామల కౌగిలిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామి
తలమునకలుగా తడిసితివా
గోవిందా.గోవిందా.గోవిందా

Like us on Facebook.....
-> Loading Time :0.0054 sec