Chowdari Garu Lyrics & Tabs by Vandemataram Srinivas
Chowdari Garu
guitar chords lyrics
చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డి గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరలో మా పాకలెందుకు
డొనేషన్ల యుగంలోన డబ్బు లేని దళితుల్లో
వందకొకడు చదువుకుంటే ఓర్చుకోని గుణమెందుకు
అరె లంచగొండి దేశంలో ఎనకబడ్డ జాతుల్లో
వెయ్యికొకడు నౌకరైతే ఏడ్చుకునే బుద్దెందుకు
పాయసాల జీడిపప్పు తినేవాళ్ళకి సామీ
మా గంజిలోన ఉప్పు చూసి గొణుగుడెందుకు
పల్లెటూళ్ళ సర్పెంచుల పట్టణాల చైరుమన్ల
సగం మీకే ఇస్తామని సంకలెగర వెయ్యమన్రు
శాసన సభ సభ్యుల్లో పార్లిమెంట్ మెంబర్లో
అరా కొరా సీటులిచ్చి ఐస్ చేసి పోతున్రు
పవర్ లేని పదవికుండే రిజర్వేషన్
శాసన సభ సభ్యుల్లో పార్లిమెంట్ మెంబర్లో
అరా కొరా సీటులిచ్చి ఐస్ చేసి పోతున్రు
పవర్ లేని పదవికుండే రిజర్వేషన్
ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు
ఆ ముఖ్యమంత్రి పదవికైన ఎందుకుండదు
పండుతున్న భూముల్లో 80 శాతం మీదే
మిల్లుల్లో మిషనుల్లో మూడొంతులు మీకిందే
రూపాయి కట్టలన్ని మీ ఇనప పెట్టెలందే
బంగారం వెండంతా మీ మెడకే మీ కాళ్ళకే
80 శాతం మంది ఎండుకొని చస్తుంటే
20 శాతం మీరు దండుకొని బతుకుతున్రు
మా చదువులు మా కొలువులు మీకు ఇస్తము
మీ సంపదలో రిజర్వేషన్ మాకు ఇస్తరా
మీ అబ్బ పేరేమో సుబ్బారావు గారైతే
మా అయ్య పేరేమో సుబ్బి గాడు అయిపోయే
మీ అన్న గారేమో విమానాల్లో ఎక్కుతుంటే
మా తమ్ముడు గాడేమో రిక్షాలు తొక్కుతుండె
మీ అమ్మకు జలుబోస్తే అపోలోలో జేరుతుంటే
మా తల్లికి కాన్సెర్ ఐతే ఆకు పసరు మింగుతుండె
మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదమంటే
దేవుళ్లలో ఒకడైనా దళితుడే లేకపాయే
చిత్రం: ఒసేయ్ రాములమ్మా (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్