Raara Krishnaiah (From "Ramu") Lyrics & Tabs by Ghantasala
Raara Krishnaiah (From "Ramu")
guitar chords lyrics
దీనుల కాపడుటకు దేవుడే ఉన్నాడు ...
దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడూ ...
ఆకలికి అన్నమూ ... వేదనకు ఔషధం ... పరమాత్ముని సన్నిధికి రావే ఓ ... మనసా ...
రారా క్రిష్ణయ్యా . రారా క్రిష్ణయ్యా ...
దీనులను కాపాడ రారా క్రిష్ణయ్యా ...
రారా క్రిష్ణయ్యా . రారా క్రిష్ణయ్యా ...
దీనులను కాపాడ రారా క్రిష్ణయ్యా ...
రారా క్రిష్ణయ్యా . ఆ ...రారా ...
మాపాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ...
ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా ...
మాపాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ...
ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా ...
పేదలమొర లాలించే విభుడవు నీవే ...కోరిన వరములనొసగే వరదుడవీవే ...
పేదలమొర లాలించే విభుడవు నీవే ...కోరిన వరములనొసగే వరదుడవీవే ...
అజ్ఞానపు చీకటికి దీపము నీవే .
పేదలమొర లాలించే విభుడవు నీవే ...కోరిన వరములనొసగే వరదుడవీవే ...
పేదలమొర లాలించే విభుడవు నీవే ...కోరిన వరములనొసగే వరదుడవీవే ...
అజ్ఞానపు చీకటికి దీపము నీవే .
అన్యాయమునెదిరించే ధర్మము నీవే ...
నీవే క్రిష్ణా ... నీవే క్రిష్ణా ...
నీవే క్రిష్ణా ...
రారా క్రిష్ణయ్యా . రారా క్రిష్ణయ్యా ...
దీనులను కాపాడ రారా క్రిష్ణయ్యా ...
రారా క్రిష్ణయ్యా . ఆ ... రారా క్రిష్ణయ్యా ...
కుంటివాని నడిపించే బృందావనం ...
గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం ...
కుంటివాని నడిపించే బృందావనం ...
గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం ...
మూఢునికి జ్ఞానమొసగు బృందావనం ...
మూగవాని పలికించే బృందావనం .
మూఢునికి జ్ఞానమొసగు బృందావనం ...
మూగవాని పలికించే బృందావనం .
అందరినీ ఆదరించు సన్నిధానం ...
అభయమిచ్చి దీవించే సన్నిధానం ...
సన్నిధానం . దేవుని సన్నిధానం . సన్నిధానం ...
రారా క్రిష్ణయ్యా .రారా క్రిష్ణయ్యా
దీనులను కాపాడ రారా క్రిష్ణయ్యా ...
రారా క్రిష్ణయ్యా .
క్రిష్ణా ... క్రిష్ణా ... క్రిష్ణా . క్రిష్ణా ...
కరుణించే చూపులతో కాంచవయ్యా ...
శరణొసగే ఖరములతో కావవయ్యా ...
కరుణించే చూపులతో కాంచవయ్యా ...
శరణొసగే ఖరములతో కావవయ్యా ...
మూగవాని పలికించి బ్రోవవయ్యా .
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా ...
మూగవాని పలికించి బ్రోవవయ్యా .
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా ...
నిన్ను చూచి బాధలన్ని మరిచేనయ్యా ...
ఆధారము నీవేరా ... రారా క్రిష్ణా...
నిన్ను చూచి బాధలన్ని మరిచేనయ్యా ...
ఆధారము నీవేరా ... రారా క్రిష్ణా...
క్రిష్ణా ... క్రిష్ణా ... రారా ...
క్రిష్ణా ...
రారా క్రిష్ణయ్యా . రారా క్రిష్ణయ్యా ...
దీనులను కాపాడ రారా క్రిష్ణయ్యా ...
రారా క్రిష్ణయ్యా .ఆ ... రారా క్రిష్ణయ్యా ...