Om Namah Sivaaya Lyrics & Tabs by S. Janaki
Om Namah Sivaaya
guitar chords lyrics
ఓం ఓం ఓం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
చంద్ర కళాధర సహృదయా
చంద్ర కలాధర సహృదయా
సాంద్రకళా పుర్ణో దయా లయ నిలయా
ఓం ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన
ఏడు అడుగులే స్వరసంతకమై
సా గా మ దనిస
దగమద ని సా స స స స
గగగ ససస నిగ మదసని దమగస
సా గా మ దనిస
దగమద ని సా స స స స
గగగ ససస నిగ మదసని దమగస
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారా ఆ ఆ
నీ మౌనమే దషోపదిష తులి నిల వేలయా
ఓం ఓం నమఃశివాయ
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షన్ముఖ ప్రమధాదులు
నీ సంకల్పానికి రుత్విజవరులై
అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస నీ గానమే
జంత్ర గాత్రముల శృతి కలయా
ఓం ఓం నమఃశివాయ
చంద్ర కళాధర సహృదయా
సాంద్రకళా పుర్ణో దయా లయ నిలయా