Allah Lyrics & Tabs by Vijay Yesudas, Shankar Mahadevan & M. M. Keeravani

Album : Sri Ramadasu (Original Motion Picture Soundtrack)PlayStop

అల్లా . శ్రీరామా!
శుభకరుడు.సురుచిరుడు.భవహరుడు.భగవంతుడెవడూ.
కళ్యాణగుణగణుడు.కరుణా ఘనాఘనుడు ఎవడూ.

అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ.
ఆనందనందనుడు.అమృతరసచందనుడు.రామచంద్రుడు కాక ఇంకెవ్వడూ!
తాగరా శ్రీరామనామామృతం . ఆ నామమే దాటించు భవసాగరం!
తాగరా శ్రీరామనామామృతం . ఆ నామమే దాటించు భవసాగరం!!
ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తీ.
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తీ.
ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి

ఏ మూర్తి జగదేక చక్రవర్తీ.
ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తీ!
తాగరా . తాగరా శ్రీరామనామామృతం . ఆ నామమే దాటించు భవసాగరం!
ఏ వేల్పు ఎల్ల వేల్పులని గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పూ.
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పూ.
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపూ.
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసుల కైమోడ్పూ!
తాగరా . తాగరా శ్రీరామనామామృతం . ఆ నామమే దాటించు భవసాగరం!

Like us on Facebook.....
-> Loading Time :0.0047 sec